
154views
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీవాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరంలో భద్రాచలం శ్రీసీతారా మచంద్రస్వామి ఆలయాన్ని పోలినట్టుగా గర్భగుడి, శిల్పాలు, విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ శిల్పకళ విశేషంగా ఆకట్టుకుంటోంది. అమెరికాలోని అట్లాంటాలో నిర్మించనున్న శ్రీసీతారామచంద్రస్వామి ఆల యానికి అవసరమైన స్తంభాలు, గోపురాలు, సింహ ద్వారాలు, శంఖుచక్రాలు తదితరాలకు సంబంధించిన శిల్పాలు ఇక్కడ తయారవుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఆలయ నిర్మాణానికి సంబంధించి మూడేళ్ల కిందట ఆళ్లగడ్డ శిల్పులతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా శిల్పాలు, విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పనులు పూర్తి చేసి పంపుతామని శిల్పులు తెలిపారు.





