
298views
సర్వత్రా ద్వేషం పెరిగి పోతున్న ప్రస్తుత కాలానికి శ్రీ నారాయణ గురు ప్రవచించిన విశ్వమానవ ఐక్యత సందేశం అత్య వసరమని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఆయన సందేశాలు ఈనాటి మన ప్రపంచానికి సంబంధించిందేనన్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలువాలో శ్రీ నారాయణ గురు సంస్థ నిర్వహించిన సర్వమత సమ్మేళనం శత వసంత ఉత్సవాల నేపథ్యంలో వాటికన్ సిటీలో మతప్రతినిధులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. ఈ రోజు ప్రపంచ దుస్థితికి మతాల బోధనల సమర్థనలో వైఫల్యం కూడా కారణం కావచ్చన్నారు. “జాతులు, మతాలు, సంస్కృతులతో సంబంధం లేకుండా మానవు లందరిది ఒకే కుటుంబం” అన్న తన సందే శంతో సమాజాన్ని, మతాలను మేల్కొల్పడానికి నారాయణ గురు తన జీవితాన్ని అంకితం చేశారని పోప్ శ్లాఘించారు.





