News

సనాతన ధర్మరక్షణకు కృషి చేద్దాం

312views

సనాతన ధర్మ రక్షణకు హిందువులంతా ఏకమవ్వాలని రాధా మనోహర్ దాస్ స్వామిజీ పిలుపునిచ్చారు. శతసహస్ర దీపార్చన మండలి ఆధ్వర్యంలో విజయవాడ సత్యనారాయణపురంలోని శిశువిద్యా మందిరం పాఠశాలలో లక్ష దీపార్చన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపవాసవ్రతం మనిషి సామాజిక, శారీరక, ఆధ్యాత్మిక, ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. రామాయణం మానవ జీవితానికి ఒక దిక్సూచి వంటిదన్నారు. దేశంలో సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.