
300views
విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు.కాకినాడ గాంధీనగర్ లోని విహెచ్పి కార్యాలయంలో హైందవ శంఖారావ సభ జిల్లా సన్నాహక సమావేశం జరిగింది. సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు, సభ జిల్లా కన్వీనర్ ఆర్.రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, మహాసభకు హాజరయ్యేవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతి పత్తి, రక్షణ, సమాజ సంరక్షణకు విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్త అప్పాజీ హిందువులంతా ఏకమవ్వాలన్నారు. నాయకులు గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ, ఉద యభానోజీరావు, కె.శ్రీనివాసరావు, రెడ్నం రాజా తదితరులు పాల్గొన్నారు.





