
ఛాందసులు, దుండగులు ప్రతి హిందూ పండుగను టార్గెట్ చేస్తున్నారు. హిందువుల మత విశ్వాసాలపై దాడులకు దిగుతున్నారు. గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు… ఇలా ప్రతి పండుగపై దాడులకు దిగుతున్నారు. తాజాగా ఛత్ పూజాను టార్గెట్ చేశారు. బిహార్ లోని సీమాంచల్ ప్రాంతంలో ఛత్ ఘాట్ ను దుండగులు, హిందూ వ్యతిరేకులు ధ్వంసం చేశారు. దీంతో స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.
అయితే.. ఈ విధ్వంసక చర్య వెనుక ఇస్లాం ఛాందసుల హస్తం వుందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఈ విధ్వంసానికి దిగిన నిందితులను పూర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజీల ద్వారా నిందితులను తాము గుర్తించామని, వారందర్నీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వారందరిపై తదుపరి చర్యలు వుంటాయని తెలిపారు. ఛత్ ఘాట్ లో పూజ శాంతియుతంగా జరిగేలా తాము చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేశారు.





