
191views
కెనడాలో హిందువుల ఆలయంపై దాడి ఘటన అవివేక చర్య అని, అది సిక్కులకు.. వారి గురువులకు కూడా అవమానకరమని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడినవారు హిందువులనే కాకుండా సిక్కులనూ అవమానపరిచారని ఒక వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ‘ఆలయంపై దాడి దురదృష్టకర ఘటన. ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. శాంతికి నిలయమైన కెనడాలో ఇలాంటివి పునరావృతం కాకూడదు. అక్కడ అన్ని సంస్కృతులకు చెందిన ప్రజలు ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నారు. దాడి చేసినవారు దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే. ఆలయాల రక్షణకు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు మతానికి చెందిన 10 మంది గురువులు తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారి త్యాగాలను కొందరు వ్యక్తులు చిన్నచూపు చూస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.





