
184views
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దేశ సేవ చేయడంలో ప్రథమ స్థానం లో ఉందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనంతపురం నగర బౌద్ధిక్ ప్రముఖ్ జయ చంద్ర తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పథ సంచలన్ కార్యక్రమంలో అనంతపురంలో జరిగింది. అనంతపురం నగరంలో దాదాపు 1000 మంది స్వయం సేవకులతో పథ సంచలన్ కార్యక్రమం జరిగింది. పథ సంచలన్ ప్రభుత్వ జూనియర్ కలశాల నుండి ప్రారంభమై DCMS రోడ్ ప్రధాన కూడళ్ల మీదుగా టవర్ క్లాక్, ఆర్ట్స్ కాలేజ్, జూనియర్ కాలేజ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ అనంతపురం నగర బౌద్ధిక్ ప్రముఖ్ జయ చంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. దేశంలో సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ముందువుండి సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.





