
365views
హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల అజమాయిషీ ఎందుకని జగద్గురు రామభద్రాచార్య సూటిగా ప్రశ్నించారు. మసీదులు, చర్చిలపై లేని అజామాయిషీ ఒక్క దేవాలయాలపైనే ఎందుకన్నారు. ప్రభుత్వాలు హిందూ దేవాలయాలపై కూడా అజమాయిషీని ఎత్తేయాలని, దీనిపై ప్రభుత్వానికి విన్నవిస్తామని, అజమాయిషీని తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు.జ్ఞానవాపి కేసు విషయంలో మాట్లాడుతూ కోర్టు పిలిచినప్పుడు కచ్చితంగా వెళ్తానని, తన వాదనను వినిపిస్తానని అన్నారు. తన వాదనతో ఈ కేసు ఓ కీలక మలుపు తిరుగుతందన్న విశ్వాసం తనకు వుందన్నారు. జ్ఞానవాపిలో భారత పురావస్తు శాఖతో అదనపు సర్వే చేయించాలని, ప్రధాన గోపురం కింద తవ్వకాలు చేపట్టాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసి కోర్టు కొట్టేసింది. దీనిపై తాము హైకోర్టుకు అయినా, సుప్రీం కోర్టుకైనా వెళ్తామని రామభద్రాచార్య ప్రకటించారు.





