
250views
టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అత్యంత ప్రీతికరమైన లడ్డూ ప్రసాదాలను భక్తులకు చేరువ చేయడంలో భాగంగా విజయవాడ పున్నమ్మతోటలోని కల్యాణ మండపంలో విక్రయాలు ప్రారంభించారు. ఈ వారం విజయవాడ కేంద్రానికి నాలుగువేల లడ్డూలను కేటాయించారు. లడ్డూల లభ్యత మేరకు శని, ఆదివారాలు కూడా విక్రయిస్తామని టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ లలితా రమాదేవి తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు కొనుగోలు చేయవచ్చని వివరించారు. దాతలు చైతన్యకుమార్, లావణ్య సహకారంతో 200 మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు.





