News

సనాతన ధర్మ ప్రచారానికి పాదయాత్ర

352views

సనాతన ధర్మ ప్రచారానికి పాదయాత్ర చేపడతున్నట్టు భారతీయ ధర్మ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతి శ్రీ కృష్ణ చరణానంద తెలిపారు.తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక ఉమా కోటిలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో ధర్మ పరిషత్‌ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా దేశంలోని అన్ని గ్రామాల్లో సనాతన ధర్మ ప్రచారంతో పాటు పాదయాత్ర చేస్తూ జ్ఞాన విజ్ఞాన చైతన్యం కలిగిస్తున్నామని పీఠాధిపతి తెలిపారు. భారతీయ సంస్కృతి, నాగరికతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు మనోవికాస తరగతులు ఏర్పాటు చేసి చైతన్యపరుస్తున్నట్టు ఆయన తెలిపారు. గో సంరక్షణ గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నామని, దేవాలయాన్ని భ్రష్టు పట్టించే వ్యవస్థపై పోరాడుతున్నామని వివరించారు. బ్రహ్మచారిణి విరజా చైతన్య, పేరవరం గీతా ఆశ్రమ అధిపతి సత్యానందగిరి స్వామి, పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదచార్యులు, కోరుకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు అనంత ఆచార్యులు పాల్గొన్నారు.