
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఈ పనులను ఆయన పరిశీలించి.. సింహగిరిపై కాటేజీలో ఈవో వి.త్రినాథరావు, టూరిజం శాఖ, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.54 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో సింహాచలం దేవస్థానంలో అభివృద్ధి పనులు పనులను వేగవంతంగా చేయాల ని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై నిర్మించే క్యూకాంప్లెక్స్‌పై మరో రెండు అంతస్తులు అదనంగా దేవస్థానం నిర్మించేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు చెప్పారు. కొండదిగువ పుష్కరిణి సత్రం బిల్డింగ్‌పై కూడా అదనంగా అంతస్తుల నిర్మాణానికి సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. యాంపీ థియేటర్, యాగశాల నిర్మాణాల విషయంపై చర్చించారు. టూరిజం శాఖ ఈఈ రమణ, ఏఈ మదన్‌మోహన్, దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు పాల్గొన్నారు.





