
255views
దేవదాయ శాఖ పరిధి నుంచి హిందూ దేవాలయాలను తప్పించేందుకు విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారావానికి పిలుపునిచ్చింది. దీనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీఠాధిపతి శివస్వామితో పాటు పలు చోట్ల నుంచి వచ్చిన స్వామీజీలు పాల్గొన్నారు. ఇతర మతాలలో ఎలాగైతే స్వేచ్ఛగా దైవ కార్యక్రమాలు చేసుకుంటున్నారో ఆ విధంగానే చేసుకునే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలను ధర్మ కమిటీలకు, ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలని కోరారు. అందుకు జాతీయ స్థాయిలో హైందవ ధర్మ శంఖరావం విజయవాడలో జనవరి 5న నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మ పరిరక్షణ సమితి సంఘాల వారు, స్వామీజీలు, పీఠాధిపతులు పాల్గొంటారని తెలిపారు.





