News

భగవన్నామ స్మరణ మోక్షానికి మార్గం

6views

నిత్యం భగవన్నామ స్మరణతోనే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, తిరుపతి ఫిలిం సొసైటీ, కేజీకే ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో ‘భగవన్నామ వైభవము’ అనే అంశంపై చాగంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. చాగంటి మాట్లాడుతూ, భగవంతుని నామస్మరణ అన్ని పాపాలను హరిస్తుందన్నారు. భగవంతుడు సర్వాంతరామి అని, ఆయన అనునిత్యం మన వెన్నంటే ఉంటారన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా మనిషి ప్రశాంతత పొందలేకున్నాడని, దీనికి కారణం అత్యాశ, ఇతరుల గురించి ఆలోచించకపోవడమేనన్నారు. మనం ఏ నామం స్మరించినా, ఏ పూజ చేసినా ఉపాసన సాధన, శ్రమ అవసరమని, నామస్మరణకు నియమాలు లేవని, ఏ రీతిలో భగన్నామ స్మరణ చేసినా ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని వివరించారు. అనంతరం చాగంటిని తిరుపతి ఫిలిం సొసైటీ ప్రతినిధులు ‘ప్రవచన ప్రశాస్త’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.