
45views
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అలాగే తాజాగా కార్పొరేట్ జిహాద్, మరింత తాజాగా స్కూల్ జిహాద్ తెరపైకి వచ్చింది. ఈ విషయం మహారాష్ట్ర కేంద్రంగా జరుగుతోంది. ముంబైలో ముస్లిం భూ మాఫియాలు అక్రమ పాఠశాలలను నిర్మిస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, అక్రమంగా పాఠశాల నిర్మాణం కూడా చేసేస్తున్నారు. ఇదంతా జిహాద్ ను వ్యాప్తి చేయడానికే చేస్తున్నారని, అలాగే ఈ పాఠశాలల్లో చాలా వాటిలో మసీదులను కూడా నిర్మిస్తున్నట్లు బయటికి వస్తోంది.
ఈ విషయాన్ని బీజేపీ నేత కిరీట్ సోమయ్య బయటికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ముంబై వ్యాప్తంగా 164 అక్రమ పాఠశాలలు వున్నాయని, ఈ 164 పాఠశాలల్లో, 150 పాఠశాలలకు ముస్లిం భూ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు కూడా వున్నాయన్నారు. ఇటువంటి పాఠశాలల్లో 65 గోవండిలో, 25 మలాడ్‌లో మరియు 12 కుర్లాలో ఉన్నాయని, ఈ విద్యాసంస్థలు ఎటువంటి అనుమతి లేదా గుర్తింపు లేకుండానే పనిచేస్తున్నాయని వెల్లడించారు.
ప్రభుత్వ భూముల్లో ముస్లిం భూ మాఫియా కేవలం అక్రమ పాఠశాలలను నిర్మించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ఆ స్థలాలను మసీదులుగా కూడా మార్చివేసిందన్న ఆరోపణలు కూడా వున్నాయి. అయితే ఈ సమస్య అక్రమ వలసదారులతో కూడా ముడిపడి వుందని, ముంబైలోకి అక్రమంగా ప్రవేశించే బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయని సోమయ్య పేర్కొంటున్నారు., ఇప్పటికే తాను BMC అధికారుల దృష్టికి కూడా తాను తీసుకెళ్లానని పేర్కొంటున్నారు.





