News

నేత్రపర్వంగా శంకర జయంతి

298views

జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని ఆదివారం అనంతపురం నగరంలోని పలు ఆలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, జిల్లా బ్రాహ్మణ ఉపనయన సేవాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ ఆవరణంలో శంకరాచార్యుల విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రథంలో శంకరాచార్యుల చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠంలో శంకరాచార్యులకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు భక్తులు శంకర పారాయణం నిర్వహించారు.