News

వియత్నాం తీరానికి ‘ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌’

314views

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ నౌక వియత్నాం పర్యటనలో భాగంగా నిన్న క్యాన్‌రాన్‌ బే తీరానికి చేరుకుందని నావికా దళ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి కి చెందిన తూర్పు నావికా దళ గస్తీ విధుల్లో భాగంగా అక్కడికి చేరుకున్న కిల్తాన్‌ నౌక సిబ్బందికి వియత్నాం పీపుల్స్‌ నేవీ అధికారులు స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్య రక్షణ ఒప్పందం మేరకు పర్యటన జరిపినట్టు తూర్పు నావికా దళ అధికారులు తెలిపారు.