News

లవ్ జీహద్ బాధితురాలు.. ఇస్లాం మతోన్మాదానికి బలైన సౌజన్య రాసిన సూసైడ్ లెటర్..

22views

రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ పిఠాపురం ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ లెటర్‌ వెలుగులోకి వచ్చింది. ‘సాధిక్’ అనే వ్యక్తి తమ కుటుంబాన్ని ఎలా మోసం చేశాడు..? శారీరకంగా, మానసికంగా ఎలా చిత్రహింసలకు గురిచేశాడు..? భర్తను ఎలా విషమిచ్చి చంపాడు..? ఆస్తులను ఎలా లాక్కున్నాడు అనే విషయాలను తేదీలు, ఆధారాలతో సహా ఆమె వివరించారు. తాను చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదని.. ఏది చెప్పించుకోకూడదని తనకు తానే గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండేలా సొంతంగా చదువుకుని అన్ని నేర్చుకున్నానని లెటర్‌లో రాశారు. తన తండ్రి ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి అని.. చాలా కష్టజీవి, త్యాగానికి పెట్టింది పేరు. ఆయన హీరో, రోల్ మోడల్. ఆయన పరువుకి తన వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదానినని రాసుకొచ్చారు. సౌజన్య సూసైడ్ లెటర్‌లో కీలక విషయాలు..

“2018లో నా జీవిత తోడు, నీడ, నా టెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకుని నిలబడడానికి కారణమైన వ్యక్తి, నా తమ్ముడు సతీష్‌ను కోల్పోయాను. నా కొడుకు రియాన్స్‌కు ఫాదర్ అటాచ్‌మెంట్‌ అసలు లేదు. అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. కేవలం రావులపాలెంలో ఫంక్షన్స్‌కు తీసుకెళ్లేవారు. అలానే వాళ్ల పేరెంట్స్, సిస్టర్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. నేనే కాకినాడలో ఒక 2 ఏళ్ల వరకు బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని.

ఈ సాదిక్ నా RIO తో చాలా ఆడిస్తూ.. ఎంటర్‌టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు.. నా భర్త ఎక్కువ ఉండరు అనే విషయాలు తెలుసుకునే వాడు. నాకూ ఆ టైమ్‌లో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్లు కోసం ట్రై చేస్తున్నా అని.. నా ఫోన్ విన్నాడు. (అకాడమీలో క్లాస్ టైం లో). మెల్లగా నా పర్సనల్ విషయాలు తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి, నాకు నా లైఫ్‌కు సపోర్టు ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రయివేట్ విషయాలు అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అది నేను ఎదురించిన ప్రతీ సారీ, నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు.

నాకున్న భయానికి నేను మెత్తంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా..  కానీ నాకు కొడుకుని చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి.. నా భర్తకి చెప్పేశాను. నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన విడాకులు కూడా ఇచ్చేస్తా.. నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని, కానీ అతను కూడా ఈ సాదిక్ చేసిన అటాక్‌తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు. నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేక పోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్‌గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని కిడ్నాప్ చేసి.. కనిపించకుండా వీడియో కాల్స్‌తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్లిపోయా. చావడానికి మార్గాలు లేకుండా మూసేసేవాడు. దగ్గర్లో ఎప్పుడూ స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని.

ఆ సమయంలో నా భర్తని World’s Most Dangerous లో 2nd place లో ఉండే కెమికల్ అంట.. అది ఇచ్చి చంపేసాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డుపెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తని కాపాడాలని హైదరాబాద్‌కు తీసుకువెళితే అక్కడికి కూడా వచ్చేశాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్ని సార్లు నన్ను కొట్టి చంపేసేంత పనిచేసేవాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. బిజినెస్ వాట్సాప్ ద్వారా 24/7 phone line లోనే ఉండేవాడు. నా ప్రతి ఫోన్ కాల్, ప్రతీ స్టెప్ మోనిటర్ చేసేవాడు. వాళ్లింటికి వెళ్లి కూడా చెప్పాను నా బాధ. వాళ్లు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి సాలియా కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.

నేను, నా భర్త హాస్పిటల్‌లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మెత్తం కంట్రోల్ తీసేసుకున్నాడు. మా ఆడపడుచుకు ఉన్న గొడవలు, వాళ్లంటే నాకున్న భయాన్ని అడ్డు పెట్టుకుని ఆడించాడు. నా ప్రతీ అడుగు వాడిని అడిగే వేయాలి. ఇప్పటికి నా ఇల్లు వాడి కంట్రోల్‌లో మార్చాడు. ఇంటి తాళం, నా భర్త Alternative fold phone. నా fold phone. నా SBI locker keys, మా డాడీ కష్టార్జితం అయిన ఒక సైటు (స్థలం పనసపాడు దగ్గర) ఒరిజనల్ డాక్యుమెంట్స్. ఇవన్నీ అతని కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. నాకింక పోరాడే శక్తి లేదు. నన్ను ఆ న్యూ ప్లాట్‌లో బంధించేస్తాడంట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్నీ చంపేస్తా అన్నాడు.. నేను అంత బాధ భరించలేను.

నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్‌లోకి వెళ్లిపోతున్నారు. రోజురోజుకి పరిస్థితులు దిగజారి పోతున్నాయి. 24/7 ఫోన్‌లైన్‌లోనే ఉండాలి. చవడానికి కూడా మేము వణికి పోతున్నాం.. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.. పోలీసుల అందరితో సాధిక్‌కి కాంటాక్ట్స్‌ ఉన్నాయని.. నేను పోలీసు డిపార్టుమెంట్‌ దగ్గరకు వెళితే నన్ను వాళ్లతో దొంగ కేసు పెట్టించి, దొంగ సాక్ష్యాలు AI తో సృష్టించి చంపేస్తా.. నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా.. అని తీవ్రంగా బెదిరిస్తున్నాడు. నా తల్లి తండ్రులు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతి రోజు నా కొడుకు ఇంటికి తిరిగొచ్చేవరకు ఈ నీచుడు సాధిక్‌తో నవ్వుతూ ఉండాల్సి వస్తోంది. అది ఇంక మా వల్ల అవ్వదు. నన్ను ఇప్పటికిప్పుడే ఇస్లాంలోకి మారమని రోజు బుక్స్ (ISLAMIC) చదివి, బుక్స్ రాయమని, లేదంటే రోజూ టార్చర్ చూపిస్తా అని చంపేస్తున్నాడు.

పది రోజుల కింద 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడకి 16 కి.మీ దూరం తీసుకువెళ్లి సముద్రంలో తోసేసాడు. మళ్లీ వెనక్కి లాగి, ఈ సారి రాళ్లపై నుంచి తోసేస్తా. మళ్లీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్లి చెప్పావంటే చంపేస్తా అని బెదిరించాడు. నా భర్తతోనే నేను వెళ్లిపోవాలి. కానీ చాలా మంది పాపం అప్పులు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. వారందరకీ కొంచెం తీర్చాను. అలానే నా అత్తమామలుకి నా తాలుక స్థిరాస్థిని అప్పజెప్పుతున్నా. వాడి ఇంట్లో వాళ్లు కూడా.. ‘వీడు నా భర్తని చంపాడు అంటే పెద్దగా రియాక్ట్ కూడా అవ్వలేదు. నేను భయపడ్డా వాళ్ల ధీమా చూసి. మా సైటు పేపర్లు డీల్ చేసిన భాషా భాయ్ మంచి వ్యక్తి.. అతనితో వీడు నన్నూ, నా కొడుకుని మాయ చేసినట్టు కొన్నాళ్లు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నా. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అసలు ఉండదు. అందుకే అందరం కలసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. వాడి క్రూరత్వంకి నేను ఇప్పుడు కూడా ఫోన్‌లైన్‌లో ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా.. అందుకే పెన్ వణికిపోతోంది..

వాడికి ఎందుకు ఎలా కోసం వస్తుందో తెలియదు. కానీ ఆ కోపాన్ని నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచీ దెబ్బ తినడం తెలియని నేను, వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించా, తట్టుకోలేక పోతున్నా.. చివరగా… Mothers please don’t get stressed about extra-curricular activities of your kids. సాదిక్ లాంటి స్నేక్స్ చాలా మంది ఉంటారు. మన పిల్లలే మన బలహీనత అన్నీ తెలుసుకుని, దూరి జీవితాలు చినాభిన్నం చేసేస్తారు… పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొత్త ఫ్లాట్‌కి వాడి హ్యాండోవర్‌లో ఉంది. వాడికి ఒక్క రూపాయి కూడా అందకూడదు. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కోశకుడు. మేము చావడానికి కూడా వణికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారంట. రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడంట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి, ఇలా డిసైడ్ అయ్యా. SBI, ICICI లో నావి, నా తల్లివి, నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంకు బ్యాలెన్స్‌.. అనాథ శరణాలయాలకు ఇవ్వవలసిన ప్రార్ధన.

ఇలాంటి వాళ్ల ట్రాప్‌లో పడొద్దు. ఇస్లాం పేరుతో ఎంతో మోసం జరుగుతోంది.. కృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరివరకు నేను నా ధర్మాన్ని వదలలేదు. “కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే, ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.

వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకి దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడింటికి వెళ్లి వేడుకున్నా నన్ను వదిలేయమని. కానీ అప్పుడు వాళ్లముందే తన్ని, కొట్టి కడుపులో ‘పిడిగుద్దులు గుద్దాడు. 10 రోజులయింది ఇంకా ఆ దెబ్బలు నా వంటిపై ఉన్నాయి. నాకు నా కొడుకుని చూస్తే భయమేస్తోంది. ఒక రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. వాడికి ఈ నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుంచి వాంతులు కడుపునొప్పి, టెన్షన్ పడిపోతున్నాడు, ఇవన్నీ చూడలేక పోతున్నా..

ఈ లెటర్స్ స్కాన్ కాపీ నేను ఎంపీ ఉదయ్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎస్పీ గారికి అందరికి అందజేయాలని ప్రయత్నిస్తున్నా. ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ జాగ్రత్త, ముఖ్యంగా చిన్నపిల్లలు, అమ్మాయిలు, అమ్మలు.
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
ప్రణతః క్లేశినాశాయి గోవిందాయ నమో నమః
ఆఖరి నిమిషం వరకూ కృష్ణపరమాత్ముని స్మరణలో..” అని సౌజన్య ఐదు పేజీల ఆత్మహత్య లేఖ రాసుకొచ్చారు.