ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు హద్దూ అదుపూ లేకుండా పోతుంది’ అన్నారు జనని శారదాదేవి. ‘మాటపై అదుపు లేదంటే, మనపై మనకు అదుపులేదని అర్థం. అది రాక్షసత్వానికి నిదర్శనం. కటువుగా మాట్లాడే వాళ్లు వేటగాళ్లతో సమానం. మానసికంగా బాధించడమూ హింసే. దానికి శిక్ష తప్పదు’ అని హెచ్చరిస్తున్నాయి ధార్మిక గ్రంథాలు.
521views
You Might Also Like
ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది
భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన సంపద ప్రకృతి. నదులు, జలపాతాలు, కొండలు, కోనలు, పచ్చని అడవులు, పశుపక్ష్యాదులతో అలరారే ప్రకృతి మనకు లభించడం నిజంగా అదృష్టమే. మనిషి...
పురాణాల్లో మాతృమూర్తులు : మాతృత్వానికి త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన దేవకీదేవి
ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి దేవకీదేవి. భగవంతుడిని కన్న తల్లిగా దేవకీదేవికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అయితే...
‘మన్ కీ బాత్’లో కడప రైతు.. వరదారెడ్డికి ప్రధాని మోదీ కితాబు
3
కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన...
మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అర్ధరాత్రి చర్యల వెనుక కారణాలు చెప్పాలన్న రాజాసింగ్
6
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న...
ఇస్లాం ‘శ్రేష్ఠ ధర్మం’ అంటూ కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
5
బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయారెడ్డి చేసిన ఇస్లాం మతంపై వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొప్పల్ జిల్లా కుక్నూర్ ప్రాంతంలో నిర్వహించిన...
భారత్లో సమస్యల నిర్మూలనకు ఇస్లామిక్ చట్టం అమలు చేయాలి : మౌలానా సాజిద్ రషీదీ
6
న్యూఢిల్లీ: దేశంలో అత్యాచారాలు, నేరాలు, అవినీతిని అరికట్టాలంటే ఇస్లామిక్ చట్టం అమలు చేయాల్సిందేనంటూ ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ చేసిన వ్యాఖ్యలు...





