News

సత్యదేవుడి ఆలయానికి రంగులు

312views

రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న స్వామివారి దివ్యకల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో రంగులు వేసే కార్యక్రమాలు ప్రారంభించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రామాలయానికి మాత్రమే రంగులు వేయగా సత్యదేవుడి బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని వ్రతమండపాలు, తూర్పు,పశ్చిమ రాజగోపురంలకు రంగులు వేయనున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. ఈఏడాది స్వామివారి దివ్యకల్యాణోత్సవాలు అంగరంగవైభవంగా చేపట్టేందుకు ఇ ప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా పనులు చురుకుగా జరుగుతున్నాయి. సత్యదేవుడి కల్యాణోత్సవాలు ఈనెల 18 నుంచి 24 వరకు జరగనున్నాయి. గతేడాది తీసుకొచ్చిన సంప్రదాయాలను పక్కనబెట్టి పూర్వపు సంప్రదాయం ప్రకా రం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో రామచంద్రమోహన్‌ తెలిపారు. గతేడాది స్వామివారి కల్యాణ తలంబ్రాలను గోటితో ఒలిచినవి వినియోగించగా అన్నవరం ఆలయానికి అటువంటి సంప్రదాయం లేదని బియ్యపు అక్షిం తలు వినియోగించనున్నారు. అదేవిదంగా శ్రీపుష్పయోగం గతేడాది ఆరుబయట వార్షిక కల్యాణవేదికపై చేపట్టగా వైదిక కమిటీ సూచనతో ఈ ఏడాది పూర్వపు పద్ధతిలో అనివేటి మండపంలో చేపట్టాలని నిర్ణయించారు.