News

విజయవాడలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర

208views

నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివ స్వామి పిలుపునిచ్చారు.విజయవాడలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని పలు హిందూధార్మిక సంస్థల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీరామశోభాయాత్ర నిర్వహించారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రహదారిలోని ఆదిశంకరాచార్య కూడలి రామకోటి వద్ద యాత్ర ఆరంభమైంది.

ఈ సందర్బంగా శివ స్వామి ప్రసంగిస్తూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల చిన్నతనం నుంచే పిల్లల్లో అవగాహన కల్పించా ల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం దేనికీలేదన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతి, మత, కుల, వర్గ, లింగ, భేదాలు లేకుండా భారతీయులంతా సంఘటి తంగా ఉన్నప్పుడే దుర్మార్గుల దాడుల నుంచి కాపాడుకోగలమన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించి నట్లు వెల్లడించారు. భక్తిచైతన్యస్వామి, నాగ లింగం శివాజీ, సూర్యతేజ, భారీ సంఖ్యలో యువకులు, మహిళలు, ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. సత్యనారాయణ పురం, ముత్యాలంపాడు, లక్ష్మీనగర్, అజిత్ సింగ్ నగర్ మీదుగా యాత్ర సాగింది.