News

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయంపై దాడి, విగ్రహాలు ధ్వంసం

301views

బంగ్లాదేశ్ లోని పటువాఖలి పట్టణంలోని అన్సార్ క్యాంపు ప్రాంతంలో ఉన్న మా మానషా మందిర్‌లోని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.మానషా దేవాలయంలోని సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పటువాఖలి పోలీస్ అధికారులు తెలిపారు.

ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సమీర్ కుమార్ దాస్ మాట్లాడుతూ.. ఆలయంలో మానస, సరస్వతి దేవతలను పూజిస్తారని.. ప్రతి ఆదివారం మానస పూజ నిర్వహిస్తామని అన్నారు.చాలా మంది ప్రతి రోజూ ఉదయం దర్శనం కోసం ఆలయానికి వెళతారు. ఈరోజు ఉదయం వెళ్లి చూడగా సరస్వతీ విగ్రహాన్ని పగలగొట్టి నేలపై వదిలేశారని.. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశామని వివరించారు.

బంగ్లాదేశ్ పూజా వేడుకల పరిషత్‌ పటువాఖలి జిల్లా అధ్యక్షుడు స్వపన్ బెనర్జీ మాట్లాడుతూ, సంఘటన తర్వాత తాను ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు.ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులను త్వరగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం సదర్ ఉపజిల్లా నిర్బాహి అధికారి-యుఎన్‌ఓ మహ్మద్ సైఫుర్ రెహమాన్ మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని సేకరించడం ద్వారా నేరస్థులను గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు” కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.

Source : Hindu Post