
463views
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే పూర్తయిందని న్యాయస్థానానికి తెలిపిన ఏఎస్‌ఐ.. పూర్తిస్థాయి వివరాలను పొందుపరిచి నివేదిక రూపొందించడానికి గడువు కావాలని కోరింది. ఇందుకు వారణాసి జిల్లా జడ్జి అనుమతించారు.





