News

సూర్యప్రభ వాహనంపై శ్రీవారి అభయం

197views

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారి సూర్యప్రభ వాహన సేవను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.

వజ్ర కవచం ధరించిన సప్తగిరీశుడు సూర్యకిరణాలు వెలుగులో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో సూర్యమండలం మధ్యనున్న నారాయణమూర్తిని నేనేనని భక్తులకు బోధిస్తూ ద‌ర్శనమిస్తారు. ఈ వాహనంపై ఉండే దేవదేవుని ప్రత్యక్ష చూసిన భక్తకోటికి రాజ్యాంగపరమైన అధికారులతో కార్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు సనాతన హైందవ సంప్రదాయంలో సూర్యారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని ఆదిమధ్యాంతరహితుడిగా పేర్కొంటారు. సూర్యారాధన వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.