
297views
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం భ్రమరాంబాదేవి భక్తులకు కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్లను గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. భక్తుల శివనామస్మరణల మధ్య శ్రీశైల వీధుల్లో పుష్పపల్లకి సేవ శోభాయమానంగా సాగింది.





