News

పంజాబ్ లో మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి… తుపాకులతో కాల్పులు….నలుగురు సైనికులు మృతి

Pulwama: Soldiers take position during an encounter in Pulwama district's Lethpora area, Jammu and Kashmir on Dec 31, 2017. Heavily armed militants entered 185 battalion CRPF training camp at around 2.10 a.m., after hurling grenades and resorting to gunfire, killing one Central Reserve Police Force (CRPF) trooper and injuring three others. (Photo: IANS)
347views

పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు జరగడం కలకలం రేపింది. కొందరు దుండగులు బుధవారం తెల్లవారుజూమున స్టేషన్‌లోకి చొరబడి తుపాకులతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కాల్పులు ఘటన వెనుక ఉగ్రకోణం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందుతులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. తక్షణ స్పందన దళాలను రంగంలోకి దింపి బాధ్యుల కోసం వేట కొనసాగిస్తున్నారు. దండగులను గుర్తించేందుకు మిలిటరీ స్టేషన్‌ ప్రాంతాన్ని మొత్తం సీజ్ చేసి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అయితే ఈ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం కొన్ని ఆయుధాలు మాయమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వాటి కోసమూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.