
269views
కేరళలో ఓ రైలులో తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడినట్టు భావిస్తున్న షారుఖ్ సైఫీ అనే వ్యక్తిని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం, ఏప్రిల్2న అలప్పుళ- కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోరపుళ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే ఓ దుండగుడు తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో తొమ్మిది మంద్రి ప్రయాణికులకు గాయాలవ్వగా.. కదులుతున్న రైల్లో నుంచి దూకడంతో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.





