News

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలి: జి20లో తీర్మానం

403views

బాలి: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై, ఆహార, ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల 17వ జీ20 సదస్సు బుధవారం ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా జీ20 దేశాలు ‘బాలి డిక్లరేషన్’ విడుదల చేశాయి. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా ముగింపు పలకాలి. వైరాలు పక్కనపెట్టి, శాంతిని నెలకొల్పాలి’ అని స్పష్టం చేసాయి.

సంక్షోభం కొనసాగుతున్న కొద్దీ ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్త చేసాయాయి. ఇది యుద్ధాల కాలం కాదని, చర్చలు, దౌత్య విధానాలతోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేసుకోవాలని డిక్లరేషన్ లో జీ20 దేశాల అధినేతలు పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి