News

కామన్వెల్త్ గోల్డ్ విన్నర్​ శరత్​ కమల్​కు అరుదైన గౌరవం..ప్రతిష్ఠాత్మక ఐటీటీఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు

289views

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్‌ టెన్నిస్‌(టీటీ) ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డ్​ గ్రహీత ఆచంట శరత్‌ కమల్‌ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్ఠాత్మక ఐటీటీఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో శరత్‌ కమల్‌కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శరత్‌ కావడం విశేషం. 2022-2026 మధ్య నాలుగేళ్ళ కాలానికి వేర్వేరు ఖండాల నుంచి ఎనిమిది మందిని (నలుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఇందులోకి ఎంపిక చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి