News

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

416views

చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది.

చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఉదయం 5.50 గంటలకు బయలుదేరి 8.50 గంటలకు జోళార్‌పేటకు చేరింది. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు మైసూరుకు చేరుకుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు మైసూరులో తిరుగు పయనమై, రాత్రి 7.35 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుకుంది.  అతివేగంగా దూసుకెళ్తున్న వందేభారత్‌ రైలును వీక్షించేందుకు దారి పొడవునా జనం బారులు తీరారు. ఈ రైలు ఈ నెల 11వ తేదీ నుంచి రెగ్యులర్‌గా పట్టాలెక్కనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి