News

గుజరాత్ తీగల వంతెన ప్రమాదంపై సిట్ దర్యాప్తు.. 9 మంది అరెస్ట్

328views

మోర్బీ: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలడంతో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు సంబంధించి నదిలో గల్లంతైన మిగతా వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టగా.. ఈ ఘటనలో బాధ్యులైన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరెవా గ్రూప్ సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు కాంట్రాక్టర్లు, ఇద్దరు టికెట్ క్లర్కులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టు రాజ్ కోట్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి