News

తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

376views

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో నిరీక్షించే పరిస్థితి లేకుండా సర్వదర్శనానికి టైం స్లాట్‌ పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో నిలిపివేసిన సర్వదర్శనం టైంస్లాట్‌ (ఉచిత దర్శనం) టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. దర్శనానికి వెళ్లేవారికి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది.

కోవిడ్‌ కారణంగా 2020లో శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శనాలను ప్రారంభించినా పరిస్థితులకు అనుగుణంగా కేవలం 40,000 మందికి మాత్రమే దర్శనాలు కల్పిస్తూ వచ్చిన టీటీడీ ఈ ఏడాది మార్చి నుంచి సడలింపులనిస్తూ సర్వదర్శనానికి అనుమతించింది. దీంతో వేలాదిగా ప్రతి రోజూ తిరుమలకు భక్తులు వస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి