
280views
బెంగళూరు: మూడేళ్ళ కిందట అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని , ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. అయితే, బెంగళూరు చెందిన ఓ విద్యార్ధి ఉగ్రదాడిలో జవాన్లు మరణించడం పట్ల సంబరాలు చేసుకున్నాడు. తాజాగా ఆ విద్యార్ధికి న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది.





