
484views
నంద్యాల: నంద్యాల జిల్లా, కొత్తపల్లిలోని శ్రీ శారదా విద్యా పీఠంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఘనంగా భజన జరిగింది. సంఘమిత్ర అధ్యక్షుడు కర్నాటి నాగ సుబ్బారెడ్డి అధ్యక్షతన దివి హయగ్రీవాచార్యులు గారి ప్రవచనములు, భజన జరిగింది. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కాదర్ బాద్ సుధాకర్, హేమలత మాలార్పణ, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యకారిణి సదస్యులు డాక్టర్ ఉదయ్ శంకర్, ధర్మ జాగరణ రాయలసీమ జోన్ కన్వీనర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







