మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చిన ప్రధాని ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ప్రధాని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సహాయక చర్యలు చేపట్టిన వారితో కూడా మోదీ మాట్లాడారు. ఆ తర్వాత మోర్బీ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ప్రధాని సమీక్ష జరిపారు. ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ చెప్పారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు.
అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్‌షోను, వర్చువల్ ‘పేజ్ కమిటీ సమ్మేళన్’ను ప్రధాని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. ప్రధాని మోదీతో పాటుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా క్షతగాత్రులను పరామర్శించారు.
Source: Nijamtoday