News

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలు

574views

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలను జరుపుకొన్నారు. నాగదేవతలకు పూజ చేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కొన్ని పట్టణాల్లో పుట్టలు లేకపోయినప్పటికీ దగ్గరలోని ఆలయాల్లో ఉన్న నాగప్రతిమలకు పాలు పోయడానికి భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచి చలివిడి చిమ్మిలి, ఆవు పాలు తదితర పూజావస్తువులతో భక్తులు శివాలయాల్లో బారులు తీరారు. పల్లెప్రాంతాల్లో కాలువ గట్టుమీద ఉన్న పుట్టలను భక్తులు ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి