
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్ సివిలిటీపై మైక్రోసాఫ్ట్ సర్వే చేయగా, భారత్‌లోనే ఎక్కువ నకిలీ వార్తల ప్రచారం జరుగుతున్నదని తేలింది. నకిలీ వార్తల పాఠకులు భారత్‌లో 60 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు. ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచార చోరీ, లైంగిక ప్రయోజనాల కోసం చేసే మెసేజ్‌లు, నకిలీ వార్తల ప్రచారం లాంటి కష్టనష్టాలపై మైక్రోసాఫ్ట్ ‘డిజిటల్ సివిలిటీ సూచిక’ విడుదల చేసింది.
22 దేశాల్లో చేసిన సర్వే సూచీలో భారత్ 7వ స్థానంలో ఉన్నది. తప్పుడు సమాచారంతో పాటు 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఆన్‌లైన్ బాధితులని తేలింది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదికాక మరో 42 శాతం మంది ఫిషింగ్, స్పూఫింగ్ బాధితులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ తన గత సర్వే నివేదిక 2018తో పోలిస్తే భారతలో అసత్య సమాచారం, అవాంఛిత సందేశాలు (అన్‌వాంటెడ్ మెసేజెస్), ఆన్‌లైన్ మోసాలు 9 శాతం నుంచి 29 శాతానికి చేరాయి.
Source: Nijamtoday





