News

శివలింగంపై ఆశ్చర్యకరంగా ఏర్పడ్డ మానవ రూపం… దర్శించేందుకు పోటెత్తిన భక్తులు

398views

అలీగఢ్​: ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వంఖాండేశ్వర్​ మహాదేవ్​ ఆలయంలో అద్భుతం జరిగింది. ఆదివారం రాత్రి కళ్లు, ముక్కు సహా ముఖం రూపురేఖలతో ఉన్న శివలింగం దర్శనం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పోటెత్తారు. అంతకుముందు శివలింగం సాధారణంగా ఉండేదని అకస్మాత్తుగా ఇలా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి