News

కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు

363views

కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రెనేడ్ దాడిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులను మనీశ్ కుమార్, రామ్ సాగర్​లుగా గుర్తించారు. వీరిద్దరూ ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందినవారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదిని అరెస్టు చేశారు. నిందితుడిని ఇమ్రాన్ బషీర్ గనీగా గుర్తించారు. అతడు హర్మేన్​లోనే నివసిస్తున్నాడని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. లష్కరే తొయిబాకు చెందిన హైబ్రిడ్ ఉగ్రవాది అని చెప్పారు. దీనిపై వేగంగా విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి