News

మోదీ పాలనలో దేశంలో వెల్లివిరుస్తున్న క్రీడా సంస్కృతి

359views

ఐక్యరాజ్య సమితి: సమగ్రాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటించింది. జాతి నిర్మాణంలో క్రీడలది కీలక పాత్ర అనీ, క్రీడలకూ, అభివృద్ధికీ మధ్య అవినాభావ సంబంధం ఉందనీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా మనసా, వాచా, కర్మణః నమ్మటం వల్లనే ఇపుడు భారత దేశంలో కొత్త క్రీడా సంస్కృతి వెల్లి విరుస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రభుత్వాలు కనీసం ఊహించనైనా ఊహించని వినూత్న క్రీడా పథకాలతో దేశంలో క్రీడారంగ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి.

సెప్టెంబర్‌ 29న అహ్మదాబాద్‌లో 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన స్ఫూర్తిదాయక  ప్రసంగం… దేశంలో అపూర్వ స్ధాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన సంకల్పాన్ని చాటి చెప్పింది. ఈ ఏడాది జాతీయ క్రీడా పోటీల్లో భారత సాయుధ దళాలకు చెందిన క్రీడాకారులతో పాటు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత  ప్రాంతాలకు చెందిన దాదాపు 7,000 మంది అథ్లెట్లు 36 రకాల క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు.

దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ క్రీడలు జరిగే ప్రతిసారీ ఆయన ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి, వెన్నుతట్టి ప్రోత్స హిస్తారు. గతంలో ఏ ప్రధానమంత్రీ క్రీడాకారుల మనసులపై ఇంత ప్రభావం చూపలేదు. గెలిచినప్పుడే కాకుండా… ఓడిపోయినా మోదీ స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడడం మన అంతర్జాతీయ క్రీడాకారులను అబ్బురపరుస్తోంది. ప్రధాని స్వయంగా మాట్లాడడం మనో నిబ్బరాన్ని పెంచుతోందని ఒలింపిక్‌ బ్యాడ్మింటన్‌ మెడలిస్టు పీవీ సింధూ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి