News

సోషల్ మీడియాలో మహిళలతో మహ్మద్ షఫీ స్నేహం… త‌ర్వాత కిడ్నాప్‌, హ‌త్య‌!

377views

పతనంతిట్ట‌: కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్​ సింగ్​, అతని భార్య లైలా ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరికి మహ్మద్ షఫీ అనే మరో వ్యక్తి తోడయ్యాడు. మహ్మద్ షఫీ.. సోషల్ మీడియాలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలతో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26న ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్​ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను పద్మం (52), రోస్లి(50)గా గుర్తించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి