News

చరిత్ర నుంచి అవగాహన పొందడం అవ‌స‌రం

419views
  • ‘కనెక్టింగ్ విత్ ది మహాభారత’ పుస్తక‌ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో డాక్టర్ మోహన్ భాగవత్

న్యూఢిల్లీ: చరిత్ర అనేది వినోదం కోసమో, సమాచారం కోసమో వినిపించడం కాదని, చరిత్ర నుంచి అవగాహన పొంది భవిష్యత్‌ బాగుండేలా వర్తమానాన్ని సరిదిద్దుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు.

న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ‘కనెక్టింగ్ విత్ ది మహాభారత’ పుస్తకాన్ని ఆవిష్క‌రించి మాట్లాడారు. మన చరిత్రలో కొంద‌రికి స్థానం ద‌క్క‌లేద‌న్నారు. రామాయణ-మహాభారతాలు గొప్ప కావ్యాల‌న్నారు. మహాభారతం జీవిత గాధ అని, సమాజం ఎలా జీవిస్తుంది, ప్రతి ఒక్కరి కర్తవ్యాలు, ఆ కర్తవ్యాలు ఏంటి, అన్ని వివరాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ జీవన పోరాటంలో మనసులో ఏవో అల‌జ‌డులు ఏర్ప‌డి, కోపం వస్తుంది, శత్రుత్వం పెరుగుతుంది… మనం మనుషులం కాబ‌ట్టి ఇలా జరగవచ్చు. వీటిని వదిలించుకోవాలంటే శ్రీమద్ భగవద్గీత చదవాల్సిందేన‌ని అన్నారు.

శతాబ్దాల నుండి, మహాభారతం మనకు లోతైన ఆధ్యాత్మిక, తాత్విక అభ్యాసానికి మూలం… అయినప్పటికీ, శతాబ్దాలుగా మనుగడలో ఉన్న మన పవిత్రమైన ఇతిహాస, సమకాలీన భౌగోళిక శాస్త్రం గురించిన విలువైన జ్ఞానం తెలియదు. ఇది, ఈ పుస్తకం డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంద‌ని భాగ‌వ‌త్ అన్నారు.

ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదన్నారు. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు సమాధానాలు ఈ గొప్ప ఇతిహాసాలలో ఉన్నాయ‌న్నారు. కాగా, ఈ పుస్త‌కాన్ని నీరా మిశ్రా ర‌చించ‌గా, గ‌రుడ ప్ర‌కాశ‌న్ వారు ముద్రించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి