
388views
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్ 10 నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు ఉన్న గోడపై రెండు రోజుల కిందట యేసు, యెహోవా బొమ్మలు పెయింటింగ్ వేస్తున్న విషయం హిందు సంస్థల దృష్టికి వచ్చింది. దీనితో ఈ విషయంపై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రైల్వే ఉన్నతాధికారులకు ధర్మధ్వజం, వి.హెచ్.పి, భజరంగదల్ ఇతర హిందూ సంస్థలు ఫిర్యాదు చేశాయి. అంతే కాకుండా సంస్థల కార్యకర్తలు విజయవాడ రైల్వే అధికారులతో మాట్లాడారు. రైల్వే అధికారులు గోడపై పూర్తిగా తెల్ల సున్నం వేయించారు.
Source: Dharmhwajam





