News

బీజేపీకి తీరని లోటు.. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కన్నుమూత

320views

బెంగ‌ళూరు: కర్ణాటక మంత్రి ఉమేశ్ గుండెపోటుతో మరణించారు. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ వయసు 61 సంవత్సరాలు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన బాత్రూములో కాలుజారి కిందపడ్డారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనలో అప్పటికే పల్స్ ఆగిపోయినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు వైద్యులు ధ్రువీక‌రించారు.

బెళగావి జిల్లా హుక్కేరి తాలూకాలోని బెల్లాబ్‌బాగేవాడిలో జన్మించిన ఉమేశ్ హుక్కేరి నుంచి 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో ఆయన తండ్రి విశ్వనాథ్ మరణం తర్వాత ఉమేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ షెట్టార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి