
388views
-
హిందూ భక్తులపై ప్రశంసల వెల్లువ
రాణేబెన్నూర్: కర్ణాటక రాణేబెన్నూర్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. నిమజ్జనం కోసం వినాయక విగ్రహాన్ని డీజే పాటలతో ఊరేగింపుగా భక్తులు తీసుకుని వెళ్తుండగా, ఓ ముస్లిం వ్యక్తి అంతిమ యాత్ర ఎదురుగా వచ్చింది. దీంతో భౌతికకాయం వెళ్ళేంత వరకు వారు తమ సంబరాలను నిలిపివేసి, శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత ఎప్పటివలె ఊరేగింపును కొనసాగించారు. హిందూ భక్తుల స్పందనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి.





