News

మహాలయ అమావాస్య కాశీయాత్ర పేరుతో ప్రత్యేక రైళ్ళు

408views

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఉలా రైల్ భాగస్వామ్యంతో మహాలయ అమావాస్య దివ్య కాశీ యాత్ర పేరుతో రైలుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభం కానుందని రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ వావిలాపల్లి రాంబాబు తెలిపారు. మధురై నుంచి ప్రారంభమై 12 రోజుల పాటు సాగుతుందని వివరించారు. ఈ యాత్రలో భాగంగా రైలు మదురైలో ప్రారంభమై దక్షిణ మధ్య రైల్వేలోని నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరగంల్ రైల్వే స్టేషన్లలో అగనుందని తెలిపారు. ఇది కాశీ, గయా, అలహాబాద్, అయోధ్య, నైమిశారణ్యం, దిల్లీ, హరిద్వార్, ఆగ్రా వంటి ప్రముఖ స్థానాలకు వెళ్ళ‌నుంద‌ని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి