News

కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ తొలగింపు

370views

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యూట్యూబ్‌ చానల్‌ ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ ఆన్‌లైన్‌ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్‌ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్‌ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

‘కావాలనే చానల్‌ను తొలగించారా? లేక సాంకేతిక పొరపాటే ఇందుకు కారణమా? అనేది తేలుస్తాం. ఇందుకు సంబంధించి గూగుల్‌/ యూట్యూబ్‌ సంస్థల ఉన్నతాధికారులతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్యను వెంటనే పరిష్కరించి ఛానల్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యాం’ అని పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో బుధవారం పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి