
629views
గోవా నూతన ముఖ్యమంత్రిగా బీ.జే.పీకి చెందిన ప్రమోద్ సావంత్ ను అధిష్టానం నిర్ణయించింది. బీ.జే.పీ మిత్రపక్షాలకు చెందిన ఇద్దర్ని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.
ప్రమోద్ సావంత్ ప్రస్తుత గోవా శాసన సభ స్పీకర్ గా కొనసాగుతున్నారు. దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్థానాన్ని సావంత్ భర్తీ చేశారు. బీ.జే.పీ మిత్ర పక్షమైన గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్, మరో మిత్రపక్షమైన MGP ఎం.ఎల్.ఏ సుదిన్ దవలికర్ లు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. పారికర్ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న 11మంది ప్రమోద్ సావంత్‌తో పాటు మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేశారు. గోవాకు సావంత్ 13వ ముఖ్యమంత్రి.
సోమవారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.





