NewsSeva

నంద్యాలలో సేవా భారతి ఉచిత నేత్ర, చర్మ వైద్య శిబిరం.

1.8kviews

నంద్యాలలోని సేవాభారతి సంఘమిత్ర సేవా సమితి అధ్వర్యంలో 17/3/2019 ఆదివారం ఉచిత నేత్ర, చర్మ వ్యాధుల వైద్య శిబిరం జరిగినది. నంద్యాలలోని చిన్మయ మిషన్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని స్వామి నేత్రాలయకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ N.C లక్ష్మయ్య, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ సుసుమ, డాక్టర్ ఉదయ శంకర్, సేవా భారతి రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ మనోహర్, సంఘమిత్ర సేవా సమితి సభ్యులు శ్రీ వెంకటయ్య మరి కొందరు సంఘమిత్ర కార్యకర్తలు పాల్గొన్నారు.

డాక్టర్ N.C లక్ష్మయ్య మాట్లాడుతూ మానవ శరీరంలో విలువైన, సున్నితమైన అవయవం కళ్ళు అని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. వేసవిలో ఎండ తీవ్రతకి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఎండలో ఎక్కువగా తిరగరాదని తెలిపారు. బి.పి, షుగర్ వ్యాధిగ్రస్తులు మరింత శ్రద్ధ వహించాలన్నారు.

డాక్టర్ సుసుమ మాట్లాడుతూ వేసవిలో చర్మం పోడిబారుతుంది కనుక చర్మ వ్యాధులు రాకుండా నూలు వస్త్రాలు ధరించాలని సూచించారు. రెండు పూటలా స్నానం చెయ్యడం ద్వారా చార్మ్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని, ఎండలో ఎక్కువగా తిరగరాదని తెలిపారు.

శ్రీ మనోహర్ మాట్లాడుతూ సేవా భారతి తరపున ప్రతి నెలా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 106 మంది కంటి వైద్య సేవలను అందుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందించడం జరిగింది. ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించి వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. మరో 52 మంది రోగులు ఉచితంగా చర్మ వైద్య సహాయాన్ని ఈ కార్యక్రమం ద్వారా పొందారు.