News

తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎలక్షన్ కమిషన్ కు వి.హెచ్.పి ఫిర్యాదు

419views

తెలంగాణా సి.ఎం కే. సి. ఆర్ కరీంనగర్ బహిరంగ సభలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విశ్వ హిందూ పరిషత్ తెలంగాణా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ని కలిసి సి. ఎం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణా సి.ఎం కేసిఆర్ హిందువులను ఉద్దేశిస్తూ’హిందూ గాళ్ళు-బొందు గాళ్ళు- దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’ అంటూ మాట్లాడారు. కే. సి. ఆర్ దేశ సర్వొన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కించపరిచే విధంగా జాతీయ సమగ్రతకు భంగం కలిగే విధంగా మాట్లాడాడని వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని వి.హెచ్.పి ప్రతినిధి బృందం లిఖితపూర్వక ఫిర్యాదు తో పాటు కేసిఆర్ ప్రసంగం సిడి ని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు అందించింది. దీనికి స్పందించిన సిఈఓ శ్రీ రజత్ కుమార్ కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులను జరిగిన ఘటనపై నివేదిక ఇమ్మని ఆదేశించారు. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వి.హెచ్.పి బృందానికి హామి ఇచ్చారు.

వి.హెచ్.పి ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామరాజు తో పాటు అధికార ప్రతినిది రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, భజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ ముఖేష్, సీనియర్ న్యాయవాది కరుణాసాగర్ , వి.హెచ్.పి జిల్లా కార్యదర్శి గిరిధర్‌, సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.