News

వెంకయ్య ప్రేరణాత్మక మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..: మోదీ

363views

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల 10వ తేదీతో పూర్తి కానున్న నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో వీడ్కోలు సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఐదేళ్ల పదవీకాలంలో సభాసమయం వినియోగం 70 శాతానికి పైగా పెరిగిందని ప్రశంసించారు. చర్చలను ఎప్పుడూ ఆయన ప్రోత్సహించేవారని, ఆయన నెలకొల్పిన ప్రమాణాలు ఆ తర్వాత వచ్చే వారికి కూడా మార్గదర్శకాలవుతాయని చెప్పారు.

ఈ ఐదేళ్లలో ఉపరాష్ట్రపతిగా చేసిన ప్రసంగాల్లో సింహభాగం యువతను, యువ శక్తిని ఉద్దేశించి చేయడం ప్రేరణాత్మకమని ప్రధాని పేర్కొన్నారు. మాటల మాంత్రికుడిగా ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని మెచ్చుకున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి